‘అమరన్’ కోసం శివ కార్తికేయన్ డబ్బింగ్

‘అమరన్’ కోసం శివ కార్తికేయన్ డబ్బింగ్

Published on Sep 12, 2024 12:16 AM IST

తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అమరన్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలిపారు. అయితే, ఈ సినిమాలో శివ కార్తికేయన్ ఓ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో హీరో శివ కార్తికేయన్ డబ్బింగ్ చెబుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ సినిమా మేజర్ వరదరాజ్ ముకుందన్ జీవితగాధ ఆధారంగా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ఈ మూవీలో స్టార్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా అక్టోబర్ 31న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు