సుధీర్ వర్మ మార్క్‌తో ఎంగేజింగ్‌గా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అవగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ క్రమంలోనే ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.

ఈ టీజర్ ఆద్యంతం ఎంగేజింగ్ కంటెంట్‌తో వచ్చింది. కార్ రేసింగ్ చేసే నిఖిల్, ఫారిన్‌లో ఓ అమ్మాయిని ప్రేమలో పడేసేందుకు అతడు పడే పాట్లు మనకు ఈ టీజర్ కట్‌లో చూపెట్టారు. ఇక రేసీ స్క్రీన్‌ప్లేతో మరోసారి సుధీర్ వర్మ ఈ సినిమాను మనముందుకు తీసుకురాబోతున్నట్లు ఈ టీజర్ కట్ చూస్తే అర్థమవుతోంది. అందాల భామలు రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్‌లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అటు కమెడియన్ హర్ష మరోసారి తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతున్నాడు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోనుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

ఈ చిత్రానికి కార్తిక్ సంగీతం అందిస్తుండగా సన్నీ ఎంఆర్ నేపథ్య సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను నవంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version