బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : ఏజెంట్ భైరవా
Next
 
ఏజెంట్ భైరవా : విజయ్ అంటే తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో, అయితే అతను నటించిన సినిమాలు కొన్ని తెలుగులో రిలీజ్ అయ్యి హిట్ అయ్యాయి. అందులో తుపాకి కూడా ఒకటి. దాంతో గత ఏడాది తమిళంలో 'భైరవ' పేరుతో వచ్చిన సినిమాని 'ఏజెంట్ భైరవ' గా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. విజయ్ క్రేజ్ మూలాన ఈ సినిమా మొదటి వరం పూర్తయ్యేసరికి యావరేజ్ గా నిలిచింది.

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 4వ స్థానంలో ఉంది.
.
దర్శకుడు ఎంచుకున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీల కరప్షన్ అనే పాయింట్ కాస్తా సామాజిక కోణంలో అందరికి భాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఈ కథకి హీరో విజయ్ ఎప్పటిలాగే తన మాస్ పెర్ఫార్మెన్స్ తో బలం తీసుకొచ్చే ప్రయత్నం చేసాడు. సినిమాలో ఉన్న ఫైట్స్ అన్ని కూడా మేగ్జిమమ్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్, అలాగే క్లైమాక్స్ లో హీరో పక్కా ప్లాన్ వేసి విలన్ ని చిన్న సమస్య నుంచి పెద్ద సమస్యలో ఇరికించడం వంటివి మాస్ ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అవుతాయి. అలాగే జగపతి బాబుకు సపొర్టర్ గా చేసిన డేనియల్ బాలాజీ కూడా తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు.

 
దర్శకుడు మంచి పాయింట్ ని చెప్పే ప్రయత్నంలో అవసరంలేని చాలా సన్నివేశాలు కథలో భాగంగా రాసుకున్నాడు . సినిమా ప్రారంభం అంతా హీరోని, హీరోయిన్ తో కలపడానికే అన్నట్లు ఉన్నాయి తప్ప కథలో భాగంగా అనిపించవు. చాలా వరకు సన్నివేశాల్లో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే విషయం ఆడియన్స్ కి తెలిసిపోతుంది. ఇక సినిమాలో పాటల్లో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకుడుని మెప్పించే రీతిలో లేవు. పాటలో సంగీతానికి, తెలుగులో రాసుకున్న లిరిక్స్ సంబంధం లేకుండా సాగుతుంటాయి. సినిమా డబ్బింగ్ లో చాలా వరకు లోపాలు కనిపిస్తాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఏ సెంటర్స్ : పర్వాలేదు
 
బి సెంటర్స్ : పర్వాలేదు
 
సి సెంటర్స్ : పర్వాలేదు
 
తీర్పు : యబోయావరేజ్ స్టార్ట్
 
Bookmark and Share