బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : మిస్టర్
Back | Next
 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2వ స్థానంలో ఉంది.
.
సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఫస్టాఫ్లో హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ హెబ్బా పటేల్ మధ్య నడిచే కొన్ని లవ్ సీన్స్ ఫ్రెష్ ఫీల్ తో బాగున్నాయి. అలాగే కమెడియన్లు శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, పృథ్వి, షేకింగ్ శేషులమధ్య తనదైన స్టైల్లో మంచి కామెడీని జనరేట్ చేశారు శ్రీను వైట్ల. సినిమా సినిమాకి తనలోని నటుడ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్న వరుణ్ ఈ సినిమాని చివరి దాకా తన భుజాలపైనే మోయడానికి ప్రయత్నించాడు. హెబ్బా పటేల్ కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుగా మరొక హీరోయిన్ లావణ్య త్రిపాఠికి నటన పరంగా తక్కువ ఆస్కారమున్న పాత్రే చేసినప్పటికీ సాంప్రదాయకరమైన గెటప్స్ లో అందంగా కనిపిస్తూ అలరించింది.

 
శ్రీను వైట్ల అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ సినిమాని చాలా వరకు పట్టాలు తప్పించి నడిపే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్ చూస్తూ చూస్తూ శ్రీను వైట్ల బాగానే చేశాడు అనుకునే సమయానికి ఆ భాగం యొక్క చివరి 10 నిముషాలు మొదలుకుని సెకండాఫ్ మొత్తాన్ని నిరుత్సాహపరిచే రీతిలో తయారుచేశాడు. అనవసరమైన పాత్రలు ఎలాంటి రీజన్ లేకుండా కథనంలోకి ప్రవేశిస్తుండటంతో కథ లాజిక్ లేకుండా తయారైంది. ఎలాంటి అర్థం లేని సన్నివేశాలు నడుస్తుంటే స్క్రీన్ మీద అసలేం జరుగుతోంది అనే భావన కలిగింది. ఇక క్లైమాక్స్ లో వచ్చే బలవంతపు కుటుంబ సన్నివేశాలు, ఫైటింగ్స్ మరింత నిరుత్సాహపరిచాయి. షకలక శంకర్, ప్రియదర్శిల కామెడీ సీన్లని ఇంకాస్త కట్ చేసి ఉండాల్సింది.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : బాగోలేదు
 
బి సెంటర్స్ : బాగోలేదు
 
సి సెంటర్స్ : బాగోలేదు
 
తీర్పు: ప్లాప్
 
Bookmark and Share