బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : నిన్ను కోరి
Back | Next
 
నిన్ను కోరి : ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పు పొందుతూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న హీరో నాని నూతన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'నిన్ను కోరి'. మొదటి నుండి మంచి అంచనాలను కలిగి ఉన్న ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ తో రాబట్టి హిట్ గా నిలిచింది.

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2వ స్థానంలో ఉంది.
.
దర్శకుడు శివ నిర్వాణ కథను క్లిస్టర్ క్లియర్ గా రాసుకోవడంతో సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా కన్ఫ్యూజన్ అనేదే కలుగలేదు. ఆ కథ కూడా రొటీన్ లవ్ స్టోరీల్లా కాకుండా కొంచెం కొత్తగా, మెచ్యూర్డ్ గా ఉంది. నిమాకు మరొక ప్రధాన ప్లస్ పాయింట్ హీరో నాని. అక్కడక్కడా మంచి టైమింగ్ తో పంచులు వేస్తూ ఎంటర్టైన్ చేసిన నాని సెకండాఫ్లోని ముఖ్యమైన ఎమోషనల్ సీన్లలో ఎక్కువ తక్కువలు లేకుండా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ను కనబర్చాడు. అలాగే నివేత థామస్, ఆది పినిశెట్టిలు మంచి నటన కనబర్చారు. లాగే హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన మురళి శర్మ, అతని అల్లుడిగా నటించిన పృథ్విలు మధ్య మధ్యలో నవ్విస్తూ అలరించారు.

 
సినిమాలో రొమాంటిక్ ట్రాక్, ఎమోషనల్ ట్రాక్ మాత్రమే ఉండటంతో రెగ్యులర్ మాస్, కామెడీ ఎంటర్టైనర్లను కోరుకునే సింగిల్ స్క్రీన్ ఆడియన్సును ఈ సినిమా పూర్తిస్థాయిలో మెప్పించకపోవచ్చు. పైగా పాత్రల తీరును కూడా మెచ్యూర్డ్ గా ఆలోచించి అర్థం చేసుకోవాల్సి ఉండటం, కథ కొంచెం మాడరన్ జనరేషన్ కోసమే అనేలా ఉండటం వలన కూడా బి, సి సెంటర్ల ఆడియన్స్ పూర్తి స్థాయిలో సినిమాకు కనెక్టవకపోవచ్చు.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : పర్వాలేదు
 
బి సెంటర్స్ : పర్వాలేదు
 
సి సెంటర్స్ : పర్వాలేదు
 
తీర్పు: హిట్
 
Bookmark and Share