బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : వైశాఖం
Back | Next
 

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 3వ స్థానంలో ఉంది.
.
సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది పాటలు గురించి. ఫారిన్ లొకేషనల్లో చిత్రీకరించిన పాటలు వినడానికి, చూడటానికి చాలా బాగున్నాయి. హీరో హరీష్, హీరోయిన్ అవంతికల డాన్స్ చాలా ఇంప్రెస్ చేసింది. లిరిక్స్ తో పాటు డీజే వసంత్ అందించిన సంగీతం అలరించింది. ఇక సెకండాఫ్ చివర్లో రివీల్ అయ్యే కొన్ని ముఖ్యమైన అంశాలు అనగా హీరో ఆకతాయిగా అందరినీ వేదించాడనికి, హీరోయిన్ హీరోను మార్చాలని ప్రయత్నించడం వంటివి సినిమా మీద ఆసక్తిని పెంచాయి.

 
ఓపెనింగ్ సన్నివేశం దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు సన్నివేశాలు వస్తూ పోతుంటాయి తప్ప అసలు కథేమిటో బోధపడదు. కనీసం సెకండాఫ్లో కథ ఫలనా విధంగా ఉంటుంది అనే ఊహను ఇచ్చే లీడ్స్ కూడా కనిపించవు. ఇక సెకండాఫ్లో రివీల్ అయ్యే కీలకాంశాలు కొంచెం బాగానే ఉన్నా తర్వాతి సన్నివేశాల్లో ఏం జరుగుతుంది అనేదాన్ని సులభంగా ఊహించవచ్చు. దీంతో కథనంలో ఎగ్జైట్మెంట్ దొరకదు. హీరో హీరోయిన్ల పాత్రలు సహజంగానే కనిపిస్తున్నా వారి మధ్య రొమాన్స్, ప్రేమ అనేది బలంగా కాకపోయినా ఒక మోస్తారుగా కూడా కదిలించలేకపోయాయి.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఏ సెంటర్స్ : యబో యావరేజ్ స్టార్ట్
 
బి సెంటర్స్ : యబో యావరేజ్ స్టార్ట్
 
సి సెంటర్స్ : యబో యావరేజ్ స్టార్ట్
 
తీర్పు: యబో యావరేజ్ స్టార్ట్
 
Bookmark and Share