బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : శమంతకమణి
Next
 

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 4వ స్థానంలో ఉంది.
.
సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ కథలోని సస్పెన్స్. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఆఖరు వరకు కారు దొంగతనం విషయాన్ని తేల్చకుండా కారు దొంగతనం ఎలా జరిగింది, ఎవరు చేసుంటారు అనే ప్రశ్నలను పదే పదే సినిమా చూస్తున్న ప్రేక్షకుల మెదళ్లలో మెదిలేలా చేసి సినిమాపై దాదాపు చివరి దాకా ఆసక్తిని నిలిపి ఉంచాడు. హీరోల పాత్రల్లో ఆది సాయికుమార్, సుధీర్ బాబుల పాత్రలు కనెక్టయ్యాయి. నారా రోహిత్ చేసిన ఎస్సై క్యారెక్టర్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయింది. సెకండాఫ్లో అతను ఒక్కోక్క ప్రధాన పాత్రని ఇన్వెస్టిగేషన్ చేసే సన్నివేశాలు కథను ముందుకు నడిపించడంతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ ను కూడా అందించాయి.

 
సినిమా ఫస్టాఫ్ అంతా అసలు కథ జోలికి వెళ్లకుండా పాత్రల పరిచయం, వారి జీవితాలను వివరించడం వంటి విషయాలతోనే నడిపించడంతో ఏదో అలా సాగిపోతున్నట్టు అనిపించింది తప్ప ఇవ్వాల్సిన ఎంటర్టైన్ చేయలేదు. ఇక చిత్ర క్లైమాక్స్ రీజనబుల్ గానే ఉన్నప్పటికీ కాస్త రొటీన్ గా తోచడంతో పెద్దగా ఎగ్జైట్మెంట్ కలుగలేదు. అలాగే ఎస్సై రంజిత్ కుమార్ కారు దొంగతాన్ని కనుగొనడానికి వేరే దారులున్నప్పటికీ ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని కేవలం ప్రధాన పాత్రలకు మాత్రమే పరిమితం చేయడం కొంచెం లాజిక్ లెస్ గా ఉంటుంది. వీటి వలన మొదటిసారి సినిమా చూసి ట్విస్ట్ తెలుసుకున్న ప్రేక్షకుడికి రెండవసారి సినిమా చూడటానికి కనీస కారణాలు కూడా దొరకవు.
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఏ సెంటర్స్ : పర్వాలేదు
 
బి సెంటర్స్ : పర్వాలేదు
 
సి సెంటర్స్ : పర్వాలేదు
 
తీర్పు: హిట్
 
Bookmark and Share