యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరెకెక్కిన్న చిత్రం ‘సాహో’. కాగా అగష్టు 30న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాలోని పాటలన్నింటినీ విడుదల చేశారు. మరి ఈ చిత్రం యొక్క ఫుల్ ఆడియో ఆల్బమ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Song 1:’సైకో సయ్యాన్’
సంగీతం : తనిష్క్ బాగ్చి
గాయని : ధన్వి భనుశాలి
Analysis: ‘సైకో సయ్యాన్’ అంటూ సాగే ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. మంచి బీట్.. దానికి అనుగుణంగా పిక్చరైజేషన్.. ప్రభాస్, శ్రద్ధా కపూర్ ఎట్రాక్షన్ కలుపుకుని సాంగ్ బాగుంది. బాలీవుడ్ కంపోజర్ తనిష్క్ బాగ్చి ఈ పాటను స్వరపరిచారు. ధన్వి భనుశాలి ఆలపించారు. తనిష్క్ బాగ్చి, శ్రీజో సంయుక్తంగా పాటను రచించారు.
Song 2: 2. ఏ చోట నువ్వున్నా
సంగీతం : గురు రాంధ్వా
గాయనిగాయకులు : హరిచరణ్ శేషాద్రి, తులసి
Analysis: నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే… నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే…’ అనే లిరిక్స్‌తో సాగే ఈ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ పాటను గురు రాంధ్వా స్వరపరచారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. హరిచరణ్ శేషాద్రి, తులసి కుమార్ ఆలపించారు. ఈ పాట ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు లవర్స్ కి కూడా బాగా నచ్చుతుంది.
Song 3: బ్యాడ్ బాయ్
సంగీతం : బాద్షా
గాయనిగాయకులు : బాద్షా, నీతి మోహన్
Analysis: ఈ బ్యాడ్ బాయ్ సాంగ్ లో ప్రభాస్ తో కలిసి శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చిందులేశారు. మేబీ ఐ యామ్ ఎ బ్యాడ్ బాయ్ కన్ యు బి మై బ్యాక్ బోన్ హాయ్ బేబీ సో.. అంటూ తెలుగు, ఇంగ్లీష్ కలగలిపి ఈ పాట లిరిక్స్ రూపొందించారు. జాక్వెలిన్ డ్యాన్స్, గ్లామర్ సాంగ్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఇక ఈ సాంగ్ ట్యూన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. తెర పై చూసినప్పుడు స్టైలిష్ విజువల్స్ ఈ పాటకు బాగా కలిసొస్తాయి అనిపిస్తోంది.
Song 4: బేబీ వోంట్ యు టెల్ మి సాంగ్
సంగీతం : శంకర్ ఎహసాన్ లాయ్
గాయకులు : శ్వేతా మోహన్, సిద్ధార్థ్ మహదేవన్,
Analysis: ‘బేబీ వోంట్ యు టెల్ మి’ అంటూ సాగే ఈ పాటను శంకర్ ఎహసాన్ లాయ్ స్వరపరిచారు. శ్వేతా మోహన్, సిద్ధార్థ్ మహదేవన్, శంకర్ మహదేవన్ ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. ఈ పాటను విభిన్న శైలిలో రూపొందించారు. అలాగే ఈ పాటలోని సాహిత్యం కూడా చాలా బాగుంది. అయితే చాలాసార్లు విన్న తర్వాత గాని ఈ సాంగ్ అండ్ ట్యూన్ మనల్ని బాగా ఆకట్టుకోదు.
తీర్పు:-
మొత్తం మీద, ‘సాహో’ నిర్మాతలు ఈ ఆల్బమ్ కోసం భారతదేశంలోని అగ్ర సంగీతకారులను ఆశ్రయించారు. ప్రతి పాట ఒకదానికొకటి భిన్నంగా ఉంది. మరియు పాన్-ఇండియా స్థాయిలో కంపోజ్ చేయబడ్డాయి. అలాగే అన్ని పాటలు బాగున్నాయి. మొత్తంగా ఇంత మంచి ఆల్బమ్ తో, మేకర్స్ సగం విజయం సాధించినట్లే. సాహో విజయానికి ఈ ఆల్బమ్ పెద్ద స్థాయిలో ఉపయోగపడనుంది.