బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : బాహుబలి 2
Back | Start
బాహుబలి 2 : దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరక్కించిన అద్భుత చిత్రం 'బాహుబలి-2'. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా 8000 స్క్రీన్లలో రిలీజైన ఈ చిత్రం అన్ని ఏరియాల నుండి బలమైన పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే గాక బలమైన వసూళ్లు సాదిస్తూ సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తూ ఈ వారం తెలుగు రాష్ట్రాల్లోనేగాక ఇండియన్ బాక్సాఫీస్ ముందు టాపర్ గా నిలిచింది.

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1వ స్థానంలో ఉంది.
.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో మొదలయ్యే ఈ సినిమాలో ప్రేక్షకులను అబ్బురపరిచే విజువల్స్, కళ్ళు చెదిరే గ్రాఫికల్ వర్క్ మేజర్ హైలెట్స్ గా నిలిచాయి. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఫ్రేమ్ ఒక వండర్ లా తోచింది. దానికి తోడు రచయిత విజయేంద్ర ప్రసాద్ క్రియేట్ చేసిన శివగామి, అమరేంద్ర బాహుబలి, కట్టప్ప, భల్లాలదేవుడు, దేవసేన వంటి పాత్రలు, వాటి స్వభావం మరింతగా ఆకట్టుకున్నాయి. ఇక రాజమౌళి ఆ పాత్రలు మధ్య నడిపిన ఎమోషనల్ డ్రామాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీక్వెన్సులు, సెకండాఫ్లో వచ్చే భావోద్వేగా సన్నివేశాలు, క్లైమాక్స్ లోని పోరాట సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన బలాలు.

 
జక్కన్న చెక్కిన ఈ శిల్పంలో పెద్దగా ప్రేక్షకులను నిరుత్సాహపరిచే బలహీనతలు లేవు. సెకండాఫ్ చివర్లో కాస్త తగ్గినట్టు తోచిన యుద్ద సన్నివేశాలు కాస్తంత నిరుత్సాహానికి గురిచేయగా తమన్నా పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడం ఆఖర్లో అనుష్క చేత పెద్దగా ఏమోషన్ పనిచకపోవడం చిన్న చిన్న అసంతృప్తులుగా తోచాయి.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : చాలా బలమైన ప్రారంభం
 
బి సెంటర్స్ : చాలా బలమైన ప్రారంభం
 
సి సెంటర్స్ : చాలా బలమైన ప్రారంభం
 
తీర్పు: చాలా బలమైన ప్రారంభం
 
Bookmark and Share