బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : శివలింగ‌
Back | Next
 
శివలింగ : ముని, కాంచన' వంటి హర్రర్ చిత్రాలతో తెలుగు వారికి సైతం బాగా దగ్గరైన నటుడు రాఘవా లారెన్స్ ఈసారి కూడా అదే హర్రర్ కంటెంట్ ని నమ్ముకుని చేసిన సినిమా 'శివలింగ'. పి. వాసు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదలై పర్వాలేదనే ఓపెనింగ్స్ తెచ్చుకుని లాంగ్ రన్ లో మంచి పాజిటివ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.


 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2వ స్థానంలో ఉంది.
.
ఈ సినిమాకి ప్రధాన బలం అంటే హర్రర్ కంటెంట్ తో కూడిన కాస్త కొత్తదనమున్న కథ అనే చెప్పాలి. సినిమా ఆరంభంలోనే దర్శకుడు పి. వాసు ఒక చిక్కు ప్రశ్నను ప్రేక్షకుల మీదికి వదిలి దాన్ని చివరి దాకా రివీల్ చేయకుండా దాని ఆధారంగానే సినిమా మొత్తాన్ని నడపడం బాగుంది. హీరో లారెన్స్ ఆ చిక్కు ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి చేసే ఇన్వెస్టిగేటివ్ ప్రయత్నాలు, వాటి తాలూకు సన్నివేశాలు ఆసక్తికరంగా బాగున్నాయి. చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన వడివేలు చేసిన కామెడీ అక్కడక్కడా బాగానే నవ్వించింది.




 
ఫస్టాఫ్ ఆరంభం అవసరం లేనంత నెమ్మదిగా సాగడం కాస్త నీరసాన్ని తెప్పిస్తే ఫస్టాఫ్ సగానికి గాని హర్రర్ కంటెంట్ మొదలుకాకపోవడం నిరుత్సాహానికి గురిచేసింది. సాధారణంగా హర్రర్ సినిమాలో లారెన్స్ అమ్మ పాత్రంటే కోవే సరళ, ఆమె ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, కామెడీ టచ్ గుర్తొస్తాయి. కానీ ఈ సినిమాలో లారెన్స్ అమ్మ పాత్రలో నటించిన ఊర్వశి అక్కడక్కడా పర్వాలేదనిపించినా చాలా వరకు నిరుత్సాహపరిచింది. ఆమె పాత్ర ద్వారా కోరినంత ఫన్ లభించలేదు. ఈ సినిమాలోని హర్రర్ సన్నివేశాలు కొన్ని బాగున్నా కూడా లారెన్స్ గత సినిమాలోని సబ్నివేశాలతో పోలిస్తే వీక్ గా అనిపించాయి. ప్రేక్షకుడు అదిరిపడేంత తీవ్రత ఉన్న సన్నివేశాలు, ఎఫెక్ట్స్ పెద్దగా దొరకలేదు.

 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : బిలో యావరేజ్
 
బి సెంటర్స్ : బిలో యావరేజ్
 
సి సెంటర్స్ : బిలో యావరేజ్
 
తీర్పు: హిట్
 
Bookmark and Share